విద్యలో విప్లవం తేనున్న కెసిఆర్ ?

0 Comments


ఎన్నికల్లో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని ఇచ్చిన కెసిఆర్ దాన్ని నెరవేర్చే దిశలో ఇప్పుడు  తెలంగాణాలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే పుట్టగొడుగుల్లా మొలిచి, నాం కే వాస్తేగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై దృష్టి సారించాడు. సరియైన వసతులు, ప్రమాణాలు పాటించకుండా, కేవలం ఫీజు రీ అంబర్స్ మెంటు కోసం నడిచే కాలేజీలను కట్టడి చేయడానికి దృఢమైన  నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యావ్యవస్థ అనేక శాఖలుగా చీలిపోయి ఉంది. విద్యావ్యవస్థ కోసం ముగ్గురు మంత్రులు, ముగ్గురో, నలుగురో కమీషనర్లు, మరెంతోమంది గ్రూప్ వన్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వీరి విధుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దీనితో విద్యావ్యవస్థకు ఒక నిర్దిష్టమైన గమ్యం లేకుండా పోయింది. ఇప్పుడు దీన్ని సంస్కరించాలని కెసిఆర్ మొత్తం విద్యాశాఖ విభాగాలన్ని ఒకే మంత్రి, ఒకే కమీషనర్ కిందకు తీసుకురావాలని నిర్ణయించారు.  దీనివల్ల మంచే జరుగుతుందని ఆశిద్దాం.
కానీ కెసిఆర్ దృష్టి సారించవలసిన అంశం ఒకటి ఉంది. ఇంటర్, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో విద్యార్థుల సంఖ్య సరిగ్గా లేదని, ఉన్న వాటిని మోసివేసే ప్త్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీలకు వేలకు వేలు ఫీజు రీఅంబ ర్స్ మెంట్ ద్వారా అందిస్తోంది. ప్రభుత్వ కాలీజీలు ఉండగా ప్రైవేటు కాలేజీలకు ఫీజులు చ్ల్లించడం ఆపేసి, ఆ డబ్బును ప్రభుత్వ కాలేజీలను పటిష్టం చేయడానికి వాడాలి. ఎవరైనా ప్రైవేటు కాలేజీలలో చేరితే అలాంట్ వారికి ఫీజు ఇవ్వం అని చెబితే అందరు కచ్చితంగా ప్రభుత్వ కాలేజీలలోనే చేరుతారు. అప్పుడే కెసిఆర్ అంటున్న కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ నెరవేరుతుంది


You may also like

No comments: