విద్యలో విప్లవం తేనున్న కెసిఆర్ ?
0 Comments
ఎన్నికల్లో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని ఇచ్చిన కెసిఆర్ దాన్ని నెరవేర్చే దిశలో ఇప్పుడు తెలంగాణాలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే పుట్టగొడుగుల్లా మొలిచి, నాం కే వాస్తేగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై దృష్టి సారించాడు. సరియైన వసతులు, ప్రమాణాలు పాటించకుండా, కేవలం ఫీజు రీ అంబర్స్ మెంటు కోసం నడిచే కాలేజీలను కట్టడి చేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యావ్యవస్థ అనేక శాఖలుగా చీలిపోయి ఉంది. విద్యావ్యవస్థ కోసం ముగ్గురు మంత్రులు, ముగ్గురో, నలుగురో కమీషనర్లు, మరెంతోమంది గ్రూప్ వన్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వీరి విధుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దీనితో విద్యావ్యవస్థకు ఒక